జీర్ణవ్యవస్థ (Digestive System)
1. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ? 1) థైరాయిడ్. 2) కాలేయం 3) కిడ్నీలు 4) పిట్యుటరీ
Answer:-2) కాలేయం
2.మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి?
1) థైరాయిడ్ గ్రంథి 2) అడ్రినాల్ గ్రంథి 3) తైమస్ గ్రంథి. 4) పిట్యూటరీ గ్రంథి
Answer:-4) పిట్యూటరీ గ్రంథి
3.ఈ కింద పేర్కొన్న ఏ గ్రంధి అదృశ్యమగుట వలన
మానవులకు వయో వృద్ధత్వము కలుగును ? 1) థైరాయిడ్
2) పిట్యుటరీ
3) థైమస్
4) పెరాథైరాయిడ్
Answer:-3) థైమస్
4. ఆహారము సాధారణముగా దీనిలో జీర్ణమగును?
1) కాలేయము
2) ఉదరము
3)చిన్న ప్రేగు
4) పెద్దప్రేగు
Answer:-3)చిన్న ప్రేగు
5.జీర్ణవ్యవస్థలో మొదట జరిగే ప్రక్రియ?
1)నీటిశోషణం. 2) జీర్ణరసం వలన పాకముగా మారును
3) అల్కాలీల తటస్థీకరణము 4) బాక్టీరియా అభివృద్ధి
Answer:-1)నీటిశోషణం
6.అయోడిన్ కలిగి ఉన్న హార్మోన్లు ?
1) థైరాక్సిన్ 2) టెస్టోస్టిరాన్ 3) ఇన్సులిన్ 4) అడ్రినలిన్
Answer:-1) థైరాక్సిన్
7.శరీరంలోని ఏ భాగంలో అయోడిన్ పేరుకుపోతుంది?
1) పిట్యూటరీ గ్రంథి 2) బాలగ్రంథి 3) ప్లీహం 4) థైరాయిడ్ గ్రంథి
Answer:-4) థైరాయిడ్ గ్రంథి
8.మానవ శరీరంలోని ఏ అవయవం "అల్బుమిన్"ని ఉత్పత్తి చేస్తుంది?
1) ఎముకమజ్జ 2) క్లోమము 3) ప్లీహము 4) కాలేయము
Answer:-4) కాలేయము
9.మద్యపానం వలన ప్రధానంగా దెబ్బతినే అవయవం?
1) మూత్రపిండాలు 2) కాలేయము 3) గుండె 4) పాంక్రియాస్
Answer:-2) కాలేయము
10.మానవ శరీరంలో ఏ గ్రంథి "ఆడమ్ ఆపిల్" గా ప్రసిద్ధి
1) కాలేయము 2) అడెర్షల్ 3) థైరాయిడ్4) టైమస్
Answer:-3) థైరాయిడ్
11.అయోడిన్ లోపించడం వలన వచ్చే వ్యాధి?
1) గాయిటర్ 2) ఎనీమియా 3) క్షయ 4) టైఫాయి
Answer:-1) గాయిటర్
12.పిండి పదార్థంపై చర్య జరిపి డెక్స్న్స్, మాల్టోజ్ అను అంత్య ఉత్పాదకాలను ఏర్పరిచే ఎంజైమ్ ఏది ?
1) లైపేజ్ 2) టయాలిన్ 3) సుక్రేజ్ 4) లాక్టేజ్
Answer:-2) టయాలిన్
13.క్రింది వానిలో ఏ ఎంజైమ్ క్లోమం ద్వారాస్రవించబడి ప్రోటీనులపై చర్య జరుపుతుంది.
1) పెప్సిన్ 2) న్యూక్లియేజ్ 3) ట్రిప్సిన్ 4) పెప్టిడేజ్
Answer:-3) ట్రిప్సిన్
14.జీర్ణనాళం ప్రారంభం నుండి అంత్యము వరకు ఉండే
కొన్ని భాగాల సరియైన వరుస క్రమం
1) ఆస్యకుహరం, గ్రసని, జీర్ణాశయం, ఆహారవాహిక, చిన్నప్రేగు, పెద్ద పేగు, పురీషనాళం
2) గ్రసని, ఆస్యకుహరం, జీర్ణాశయం, ఆహారవాహిక,
చిన్నప్రేగు, పెద్ద పేగు, పురీషనాళం.
3) గ్రసని, ఆస్యకుహరం, జీర్ణాశయం, ఆహారవాహిక, చిన్న ప్రేగు, పురీష నాళం, పెద్దపేగు.
4) ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక,, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్ద పేగు, పురీషనాళం.
Answer:-4) ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక,, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్ద పేగు, పురీషనాళం.
15.అంధనాళాన్ని మరియు జెజునాన్ని కలిపే భాగం. 1) ఆంత్రమూలం 2) శేషాంత్రికం
3) కోలాన్
4) పురీషనాళం
Answer:-2) శేషాంత్రికం
16.క్షీరదాలలో లాలాజలగ్రంధులు క్రింది ఏ భాగంలో ఉంటాయి. 1) ఆస్యకుహరం 2) గ్రసని 3) ఆహారవాహిక 4) నోరు
Answer:-1) ఆస్యకుహరం
17.క్రింది వానిలో సరియైనది
ఎ) దంతాలు డెంటిన్ అనే అత్యంత గట్టి పదార్థంతో ఏర్పడును
బి) దంతపు పైభాగాన్ని కప్పుతూ ఎనామిల్ అనే మెరిసే
పొర ఉంటుంది
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదికాదు
Answer:-3) ఎ, బి
18.శాశ్వత దంతాలలో క్రింది ఏ రెండు రకాల దంతాలు సమానసంఖ్యలో ఉంటాయి
1) కుంతకాలు, రదనికలు 2) కుంతకాలు,
అగ్రచర్వనకాలు 3) అగ్రచర్వనకాలు, చర్వనకాలు
4) కుంతకాలు, చర్పణకాలు
Answer:-2) కుంతకాలు,అగ్రచర్వనకాలు
19.డయాస్జీమా అనగా
1) కుంతకాలు లోపించడం వలన ఏర్పడే ఖాళీ ప్రదేశం 2) రదనికలు లోపించడం వలన ఏర్పడే ఖాళీ ప్రదేశం 3) అగ్రచర్వణకాలు లోపించడం వలన ఏర్పడే ఖాళీ ప్రదేశం
4) చర్వణకాలు లోపించడం వలన ఏర్పడే ఖాళీ ప్రదేశం
Answer:-2) రదనికలు లోపించడం వలన ఏర్పడే ఖాళీ ప్రదేశం
20.జతపరచుము
దంతాలు. సాధారణనామం
1) కుంతకాలు. ఎ. విసురుదంతాలు
2) రదనికలు. బి. నములు దంతాలు
3). అగ్రచర్వణకాలు. సి. చీల్చుదంతాలు
4. చర్వనకాలు. డి. కోరపళ్ళు
Answer:-1-D,2-C.3-B.4-A
21.క్రింది వానిలో ఏ హార్మోన్ జీర్ణాశయం నుండి స్రవించబడి జఠరరసం ఉత్పత్తిలో, జీర్ణాశయ కదలికలకు తోడ్పడును
1) సెక్రెటిన్ 2) గాస్ట్రిన్ 3)విల్లికైనిన్ 4) ఎంటిరోకైనిన్
Answer:-2) గాస్ట్రిన్
22.క్రింది వానిలో సరియైనది.
1) జీర్ణాశయం నుండి ఆహారం ఆంత్రమూలంలోకి చేరడానికి సెక్రెటిన్ తోడ్పడును.
2) ఆంత్రమూలంలో ఉత్పత్తి అయ్యే కొలిసిస్టోకైనిన్ క్లోమరసం ఆంత్రమూలం చేరడంలో తోడ్పడును
1) ఎ మాత్రమే
2) ఎ,బి
3) బి మాత్రమే
4) ఏదీకాదు
Answer:-
2) ఎ,బి
23.క్రింది వానిలో సరియైనది ఏది
ఎ) పెద్దపేగులో ఎటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి కావు బి) పెద్ద పేగులో E కొలై అనే బాక్టీరియాను కలిగిన భాగం కోలాన్
సి) పెద్ద పేగులో చూషకాలు వంటి నిర్మాణాలు ఉండి చిన్న చిన్న ఆహారరేణువులు శోషణం చేసి రక్తంలోకి పంపించును.
1) ఎ,బి, మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ మాత్రమే
4) ఎ, బి, సి
Answer:-
1) ఎ,బి, మాత్రమే